బన్ని సినిమాకి మెగాస్టార్ … చరణ్ కి సినిమాకి పవర్ స్టార్

మాములుగా సినిమాలే చూడని పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తొలిప్రేమ చుసిన తరువాత రంగస్థలం  సినిమా చూడటానికి వెళ్ళాడు. సినిమాను థియేటర్ లో  చూసి ఎంజాయ్ చేశాడు. రంగస్థలం సక్సెస్ మీట్ లో కొద్దిగా ఎక్కువగానే మాట్లాడాడు. రంగస్థలం సినిమా ఆస్కార్ కు పంపాల్సిన సినిమా అని చరణ్ నా తమ్ముడు లాంటి వాడు అని అన్న వదిన  నాకు అమ్మ నాన్న లాంటివారు అని అన్నాడు. రంగస్థలం సక్సెస్ పై పవన్ చాలా గర్వంగా కూడా కనిపించాడు. పైదంతా కొన్ని రోజులు క్రితం జరిగింది అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కదిలొచ్చారు. మే 4వ తేదిన విడుదలకు సిద్దమైన బన్నీ మూవీ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా మూవీకి ఇప్పుడు సాంగ్ కోసం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా సెట్స్ కు చిరంజీవి వెళ్లి యూనిట్ సభ్యులను అబినందించాడు. బన్నీ వేసే స్టెప్పులను చూస్తూ ఆనందించారు. తమ ఫ్యామిలీలో అంతా ఒకటే.. విబేధాలు ఏ మాత్రం లేవు ఈ కలయికలు.. మీటింగులు అన్యాపదేశంగా చెబుతున్నట్లుగా ఉంది. మెగాస్టార్ అంటే బన్నీకి ఎంతగా ఇష్టమో అతని మాటల్లోనే తెలిసిపోతుంది. బాబాయ్ అంటే చరణ్ ఎంత ప్రాణమో మాటల్లో వర్ణించలేకపోయాడు. చిన్న చిన్న విబేధాలు ఫ్యాన్స్ మధ్య అడపాదడపా కనిపిస్తున్నా వాటిని అన్నిటినీ పటాపంచలు చేసేందుకు.. చక్కని ఉపాయంతో అలరిస్తుంటుంది మెగా ఫ్యామిలీ. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం.. అందరు హీరోలను ఎంకరేజ్ చేస్తుండడం చూస్తే.. మెగా ఫ్యామిలీలో ఈ ఈక్వేషన్లు భలే ఉంటాయ్ బాసూ అనిపించక మానదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*